Traffic Violations: ఒక బైక్పై 300 ట్రాఫిక్ చలాన్లు..రూ.3లక్షల ఫైన్

Traffic Violations: ఒక బైక్పై 300 ట్రాఫిక్ చలాన్లు..రూ.3లక్షల ఫైన్

Traffic Violations: ఈ బైకర్కు రోడ్లపై బాగా తిరగడం అలవాటు.. పైగా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం ఒక హామీ పెట్టుకున్నాడు. మనోడు ఎప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకున్న పాపాన పోలేదు. ఇక సిగ్నల్ జంపింగ్ లు అంటావా లెక్కేలేదు.. ఇంత చేస్తున్నాటంటే ట్రాఫిక్ పోలీసులు చూస్తూ ఉంటారా.. తమ పని తాము చేసు కుంటూ పోయారు.. చివరి మనోడి ట్రాఫిక్ చలాన్ల చిట్టా.. పాపాల పుట్టలా పెరుక్కుంటూ పోయింది.. అతి తక్కువ సమయంలో 300 చలాన్లు రాశారు ట్రాఫిక్ పోలీసులు. ఇలా వదిలితే మనోడు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ లు, బైక్ నడుపుతూ ఫోన్ మాట్లాడి ఇతర వాహనదారులను ప్రమాదాలకు గురిచేసేలా ఉన్నాడని గ్రహించి.. చర్యలకు సిద్దమయ్యారు. బెంగుళూరు కు చెందిన ఓ వ్యక్తి కి సంబంధించిన భారీ చలాన్లు కథ గురించి తెలుసుకుందాం రండి.. 

బెంగళూరులోని సుధామ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు అతని KA05 KF7969 నెంబరు గల యాక్టివాపై   రూ. 3లక్షల విలువైన 300 చలాన్లు ఉన్నాయి. బైకు ఒకటే..300 ట్రాఫిక్ చలాన్లు..రూ. 3లక్షల జరిమానా..ఈ చలాన్లను చూసి ట్రాఫిక్ పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇతని చలాన్లు .. పాపాల పుట్టలా పెరిగిపోతున్నాయి. ఇతను జరిమానా చెల్లించేలా లేడు.. ఇక మనమే అతని ఇంటికి వెళ్లి వసూలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు గట్టిగా డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే అతని ఇంటికి వెళ్లారు. జరిమానా చెల్లించాలని కోరారు. దీనికి ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని  నివ్వెర పోయారు. 

నేను జరిమానా చెల్లించను.. కావాలంటే నా బైకు  (KA05 KF7969)ను స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు. ఇక ఇలా అయితే కాదు.. అని గట్టిగా నే వార్నింగ్ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న చలాన్లు క్లియర్ చేయకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆ వ్యక్తి బకాయిలు క్లియర్ చేయడానికి కొంత సమయం కావాలని పోలీసులను అభ్యర్థించాడు.