ఆఫర్..ఆఫర్.. మారుతి కార్లపై రూ.62 వేల డిస్కౌంట్

ఆఫర్..ఆఫర్.. మారుతి కార్లపై రూ.62 వేల డిస్కౌంట్

మారుతి సుజుకీ ఫిబ్రవరి 2024 లో తన మోడళ్లపై మంచి ఆఫర్లను అందిస్తోంది. వీటిలో నగదు తగ్గింపు, ఎక్ఛేంజ్ ఆఫర్లు, ప్రత్యేక కార్పొరేట్ బోనస్ లు ఉన్నాయి. మారుతి సుజుకీ Arena డీలర్ షిప్ లో ఈ డిస్కౌంట్ లభిస్తోంది. మారుతి సెలెరియో, వ్యాగన్ ఆర్ తో సహా అనేక మోడళ్లను డిస్కౌంట్ తో కొనుగోలు చేయొచ్చు. వివరాల్లోకి వెళితే.. 

మారుతి సుజుకీ ఆల్టో కె10

ఆల్టో కే10 పెట్రోల్ మోడల్ కు రూ. 62 వేల తగ్గింపు లభిస్తోంది. ఇందులో రూ. 40 వేల నగదు డిస్కౌంట్, రూ.15 వేల ఎక్చేంజ్ ఆఫర్, రూ.7 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. అదే CNG వెర్షన్ పై రూ. 40 వేల తగ్గింపు ఉంది. ఇందులో రూ. 18 వేలు నగదు తగ్గింపు, రూ. 15వేలు ఎక్ఛేంజ్ ఆఫర్, రూ. 7వేలు కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి 

S-ప్రెస్సో

మారుతి S- ప్రెస్సో  పెట్రోల్, CNG వేరియంట్ లపై వరుసగా రూ. 61వేలు, రూ. 39 వేల డిస్కౌంట్ లభిస్తుంది. పెట్రోల్ ట్రిమ్ పై రూ. 40వేల తగ్గింపు, రూ15 వేలు ఎక్చేంజ్ ఆఫర్, రూ.6వేలు కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. CNG వేరియంట్ లు రూ. 18వేల నగదు తగ్గింపు, 15వేల ఎక్ఛేంజ్ ఆఫర్ , 6వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. 

వ్యాగన్ ఆర్

మారుతి Wagon R పై రూ.61వేల డిస్కౌంట్ లభిస్తోంది. Wagon R  పెట్రోల్ AMT  వేరియంట్ పై నగదు రూ.40 వేలు, ఎక్ఛేంజ్ రూ.15వేలు, 6 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది. మ్యాన్యువల్ వేరియంట్ పై మొత్తం రూ.56వేల డిస్కౌంట్ వస్తుంది. ఇందులో రూ.30వేలు నగదు తగ్గింపు, రూ. 20వేలు ఎక్చేంజ్ ఆఫర్, రూ.6వేలు కార్పొరేట్ తగ్గింపు వస్తుంది. WagonR CNG ట్రిమ్ లపై మొత్తం 36వేల డిస్కౌంట్ లభిస్తుంది.