సరికొత్త హీరో స్ల్పెండర్ ప్లస్..మైలేజ్ 80.6Kmpl

సరికొత్త హీరో స్ల్పెండర్ ప్లస్..మైలేజ్ 80.6Kmpl

Hero Splender Plus: హీరో స్ల్పెండర్ ప్లస్ సరికొత్త లుక్తో ఆకర్షణీయమై మైలేజ్తో ఆకట్టుకుంటోంది. 97సిసి ఇంజిన్తో 8.05Nm గరిష్ట్ టార్క్ , 8.02 PS పవర్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కమ్యూటర్ 80.6 kmpl మైలేజీని ఇస్తుంది.  ముందు, వెనక డ్రమ్ బ్రేకులు, 9.8 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని బరువు 112 కిలోలు. ట్యూబ్లెస్ టైర్లతో వస్తుంది. బైక్ లో నాలుగు స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. 

  • ALSO READ | MG మోటార్స్ భారీ డిస్కౌంట్..ఎలక్ట్రిక్ కార్లపై రూ.1.40 లక్షల తగ్గింపు

ఇది 3 వేరియంట్లు, 6 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. స్టాండర్డ్ స్ల్పెండర్ ప్లస్, i3S టెక్నాలజీతో కూడిన వెర్షన్, Xtec టెక్నాలజీని కలిగిన వేరియంట్.. రెండోది బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తి LCD ఇన్ స్ట్రుమెంటేషన్, i3S టెక్నాలజీ, సైడ్ స్టాండ్ , ఇంజిన్ కిల్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది.  స్ల్పెండర్ ప్లస్ ధర, స్పెసిఫికేషన్ల ను పరిశీలిస్తే బజాజ్ ప్లాటినా100, హోండా షైన్, హోండా SP 125 లకు గట్టి పోటీనిస్తోంది. 
హీరో స్ల్పెండర్ ఫ్లస్ ధర ప్రారంభ ధర రూ. 75,191 నుంచి 77, 826(ఎక్స్ షోరూమ్ ). రూ. 90,190 (ఆన్ రోడ్).