విహారయాత్రలో విషాదం.. విద్యార్థి మృతి

విహారయాత్రలో విషాదం.. విద్యార్థి మృతి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల విహారయాత్ర విషాదంగా మారింది. అమీర్​పేట సిస్టర్ నివేదిత ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను ఒక రోజు విహారయాత్ర నిమిత్తం ఆదిబట్ల పరిధిలోని వండల్​లా పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ 8వ తరగతి విద్యార్థి వేలంగి దమ్రుఖ్ శివ సూర్య తేజ ఆటలు ఆడుతూ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యాడు. 

పార్కులోని మెడికల్ సెంటర్‎లో ప్రథమ చికిత్స అందించినా పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు శనివారం మృతి చెందాడు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, వయసుకు మించిన ఆటలు ఆడించడం వల్లే ఈ ఘటన జరిగిందని అమీర్​పేట స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.