కాగజ్ నగర్‌లో విషాదం.. కారు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కాగజ్ నగర్‌లో విషాదం.. కారు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో విషాదం నెలకొంది.  కాగజ్ నగర్ కు చెందిన ఓ కుటుంబం  వైద్యం కోసం వెళ్తుండగా కారు ప్రమాదం జరిగింది.  ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. 

కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ కుచెందిన ఓ కుటుంబం కారులో మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది..వీరంతా వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తున్నారు. ఈ  క్రమంలో  మహారాష్ట్రలోని దేవాడ ప్రాంతంలో కారు అదుపు తప్పి బ్రిడ్జీపై నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్సకోసం వారిని సమీప  ఆస్పత్రికి తరలించారు. 

మరణవార్త తెలుసుకున్న మృతుల కుటుంబం సభ్యులు బోరున విలపించారు. ప్రమాదంలో ఒకేకుటుంబానికి చెందిన నలుగురు చనిపోయవడంతో కాగజ్ నగర్ లో విషాద చాయలు అలముకొన్నాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.