
మియాపూర్: హైదరాబాద్లోని మియాపూర్లో విషాదం జరిగింది. మియాపూర్ గోకుల్ ప్లాట్స్లోని డిలైట్ డ్యాన్స్ స్టూడియోలో ఉత్తర్ ప్రదేశ్కు చెందిన సాగర్ కుమార్(17) డ్యాన్స్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి డ్యాన్స్ స్టూడియోలోని ఓ గదిలో సాగర్ కుమార్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్యాన్స్ స్టూడియో యజమాని పరమేష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
గత పది రోజుల నుంచి డ్యాన్స్ మాస్టర్ సాగర్ కుమార్ బాధలో ఉన్నట్టు అకాడమీ యజమాని పరమేష్ పోలీసులకు తెలిపాడు. ఓ అమ్మాయిని ప్రేమించి ప్రేమ విఫలమై బాధపడుతున్నట్టు యజమానికి డ్యాన్స్ మాస్టర్ సాగర్ కుమార్ చెప్పినట్లు తెలిసింది. డ్యాన్స్ స్టూడియో యజమాని పరమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.