- ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్ తండాలో విషాదం
కారేపల్లి, వెలుగు: టూత్ పేస్ట్ అనుకొని ఓ చిన్నారి ఎలకల మందు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్ తండాకు చెందిన ధారావత్ మానస(3)కు ఈ నెల 17న తన ఇంట్లోనే ఉదయం బ్రష్ చేసుకునే సమయంలో ఎలకల మందు ట్యూబ్ కనిపించింది.
బ్రష్ చేసేటప్పుడు పేస్ట్ తినే అలవాటు ఉన్న చిన్నారి ఎలకల మందు తినగా, గమనించిన కుటుంబీకులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదు నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయింది. చిన్నారి తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపి తెలిపారు.
