హైదరాబాద్లో విషాదం.. పని ఒత్తిడి తట్టుకోలేక.. 32వ ఫ్లోర్ పై నుంచి దూకేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

హైదరాబాద్లో విషాదం.. పని ఒత్తిడి తట్టుకోలేక.. 32వ ఫ్లోర్ పై నుంచి దూకేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

రంగారెడ్డి జిల్లా: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. 32వ ఫ్లోర్ పై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పని ఒత్తిడి కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.

ఉద్యోగంలో ప్రమోషన్ రాక.. పని ఒత్తిడి పెరిగి మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఢిల్లీకి చెందిన అమన్ జైన్(32) అమెజాన్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కుటుంబ సభ్యులతో కలిసి మైహోం టర్క్ క్షియా టవర్ ఒన్లో నివాసం ఉంటున్నారు.

కాగా భవనం 32వ అంతస్తుకు చేరుకున్న అమన్ జైన్ ఒక్కసారిగా అక్కడ నుండి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర గాయాలతో అమన్ జైన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదని, పని ఒత్తిడి కూడా బాగా పెరగిందని కుటుంబ సభ్యులతో చెప్పేవాడవి దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.