పట్టాలపై ఆగిపోయిన డీసీఎంను ఢీకొట్టిన రైలు

పట్టాలపై ఆగిపోయిన డీసీఎంను ఢీకొట్టిన రైలు

కర్నాటక బీదర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బల్కీ  క్రాసింగ్ వద్ద ఓ డీసీఎం పట్టాలు దాటుతుండగా రైల్వే గేటు పడింది. అకస్మాత్తుగా గేటు పడటంతో వాహనం పట్టాలపైనే నిలిచిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ రైలు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో ట్రైన్ వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్ ముందుభాగం, డీసీఎం వెనుక భాగం దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.