ఆలేరులో విరిగిన రైలు పట్టా.. తప్పిన ప్రమాదం

ఆలేరులో విరిగిన రైలు పట్టా.. తప్పిన ప్రమాదం

యాదాద్రి (ఆలేరు), వెలుగు: యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. స్టేషన్‌లోని లూప్‌లైన్‌లో 10 అంగులాల మేర పట్టా విరిగిపోయింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఈ ట్రాక్‌పైకి రాగానే సౌండ్‌లో తేడా వచ్చింది. గమనించిన కొందరు ప్రయాణికులు వెంటనే గార్డ్‌కు విషయం చెప్పగా, అతడు రైల్వే ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారి వచ్చి పట్టా విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. 

అనంతరం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను అక్కడి నుంచి పంపించి, పట్టా విరిగిన ప్లేస్‌లో తాత్కాలికంగా ఫిష్‌ప్లేట్‌ను అమర్చారు. ఘటన కారణంగా రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని రైల్వే ఆఫీసర్లు చెప్పారు.