భద్రాచలం జూనియర్ కాలేజీలో.. గ్రూప్స్, మెయిన్స్ ప్రిపరేషన్కు పుస్తకాలు పంపిణీ

భద్రాచలం జూనియర్ కాలేజీలో.. గ్రూప్స్, మెయిన్స్ ప్రిపరేషన్కు పుస్తకాలు పంపిణీ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం జూనియర్​ కాలేజీలో గ్రూప్స్, మెయిన్స్, ఐఐటీ, జేఈఈ, నీట్​కు ప్రిపేర్​అయ్యే విద్యార్థులకు ట్రైనీ కలెక్టర్​సౌరభ్​శర్మ శుక్రవారం పుస్తకాలను పంపిణీ చేశారు. ఇటీవల భద్రాచలం సబ్​కలెక్టర్ మృణాళ్​ శ్రేష్ఠ జూనియర్​ కాలేజీని సందర్శించినప్పుడు విద్యార్థులు తమకు ప్రిపరేషన్​ కోసం పుస్తకాలు కావాలని అభ్యర్ధించారు. 

అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవసరమయ్యే పుస్తకాలను ఆయన కొనుగోలు చేసి ట్రైనీ సబ్ ​కలెక్టర్​ ద్వారా అందజేశారు. ఎలా ప్రిపేర్ ​కావాలో? విద్యార్థులకు సూచించారు. కెరీర్​లో రాణించాలంటే గోల్​ ఉండాలని వారికి తెలియజేశారు.