
- ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ
పాల్వంచ, వెలుగు : చిన్నతనం నుంచే క్రీడల్లో రాణించడంతోఎన్నో ఉప యోగాలు ఉన్నాయని భద్రాద్రికొత్తగూడెం ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ తెలిపారు. ఇటీవల ఖమ్మం లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల స్థాయి టెన్నిస్ పోటీల్లో ప్రథమ శ్రేణిలో నిలిచిన క్రీడాకారులను శుక్రవారం పట్టణంలోని శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో ఆయన అభినందించారు. అనంతరం ఆల్ ఇండియా నేషనల్ ఆర్చరీకి ఎంపికైన వంశీ తోపాటు హైదరాబాద్ ఓపెన్ నేషనల్ టె న్నిస్ అండర్ 60లో విజేతగా నిలిచిన పిడి అన్నం వెంకటేశ్వ ర్లును సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడంతో చిన్నతనంలోనే ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుందన్నారు. పాల్వంచ మినీ స్టేడియం క్రీడాకారులకు అందుబాటులో ఉండటం స్థానిక క్రీడాకారుల అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి.యుగంధర్ రెడ్డి, పాల్వంచ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్, కోచ్ రాంబాబు, కోశాధి కారి వంశీ, కబీర్, భద్రాచలం టెన్నిస్ అధ్యక్షులు దాట్ల రాజు, కుటుంబరావు, కోచ్ డేనియల్, కృష్ణారావు, రాజ్ కుమార్, సతీశ్ పాల్గొన్నారు.