తాడ్వాయి మండలంలో హ్యాపీనెస్ సెంటర్ ను సందర్శించిన ట్రైనీ డీఎస్పీలు

తాడ్వాయి మండలంలో హ్యాపీనెస్ సెంటర్ ను సందర్శించిన ట్రైనీ డీఎస్పీలు

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం తక్కల్లపల్లిలో ఆదివాసి పిల్లల విద్య కోసం స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించిన భీమ్​చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ ను ట్రైనీ డీఎస్పీలు గుడెల్లి సృజన, ధైనంపల్లి ప్రవీణ్ కుమార్ లు శనివారం సందర్శించారు. సెంటర్ లో విద్యనభ్యసిస్తున్న ఆదివాసి విద్యార్థులకు విద్యా ప్రాముఖ్యతల గురించి వివరించారు. 

మారుమూల ప్రాంతంలోని విద్యార్థుల చదువు కోసం పాఠశాలను స్థాపించిన భీమ్ చిల్డ్రన్ హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థను అభినందించారు. కార్యక్రమంలో భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ సభ్యులు ఇస్రం సంతోష్, శశిధర్ రెడ్డి, ధైనంపల్లి ప్రకాశ్, శ్రీలత, కల్పన, రక్షిత, ముప్పు సాయికుమార్, వెడ్మ లావణ్య, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.