
హైదరాబాద్లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ల శిక్షణ సదస్సు జరగనుంది. ఈ ట్రైనింగ్ సెషన్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 80 మంది పార్లమెంట్ విస్తారక్లు పాల్గొననున్నారు. ఈనెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ శామీర్పేలోని లియోనియా రిసార్ట్స్లో విస్తారక్ల సదస్సు జరగనుంది. ఈ మీటింగ్కు సంబంధించి ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించనున్నారు.
ఈ కీలక సమావేశాల్లో బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ బిఎల్ సంతోష్ పాల్గొంటారు. అలాగే రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ కూడా పాల్గొంటారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. నార్త్ తో పాటు సౌత్లో పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇటీవలే తెలంగాణలో బీజేపీ హైకమాండ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. తాజాగా పార్లమెంటు విస్తారక్ల శిక్షణ సదస్సును కూడా తెలంగాణ లోనే నిర్వహిస్తోంది.