
తెలంగాణ అసెంబ్లీలోతొలిసారి అడుగు పెట్టబోతున్న కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రొ.నాగేశ్వర్, మాజీ మంత్రి చిన్నారెడ్డి. కొత్త ఎమ్మెల్యేలకు క్లాసులు చెప్పారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్లోని ఎల్లా హోటల్లో శిక్షణా తరగతులు నిర్వహించారు.
మరోవైపు తెలంగాణ కొత్త సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇవాళ సాయంంత్ర హైదరాబాద్ లో డీకే శివకుమార్ సీఎం అభ్యర్థి పేరును వెల్లడించనున్నారు. కొత్త కేబినెట్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 15 మంది మంత్రులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ తర్వాత ఢిల్లీకి వెళ్లిన డీకే శివకుమార్, అబ్జర్వర్లు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ కు వారి అభిప్రాయాలను అందించారు. పరిశీలన తర్వాత సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్.. డిసెంబర్ 7న కొత్త సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.