- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
ట్యాంక్ బండ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ ద్వారా రాజ్యాంగబద్ధంగా మాలలకు రావాల్సిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ట్యాంక్బండ్లోనిడాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోస్టర్ పాయింట్ లో మాలలకు ఇచ్చిన15 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాలల జనాభా నిష్పత్తికి అనుగుణంగా రోస్టర్ పాయింట్లను సవరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బూర్గుల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఎం. సరళ, మోహన్ కృష్ణ, శ్రీకాంత్, జైకుమార్, అనిల్ కుమార్, లలిత, రమేశ్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
