
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగులకు డీఏను పెంచుతూ ట్రాన్స్‌కో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు 5.896 శాతం డీఏ ఇస్తుండగా..దాన్ని 8.776 శాతానికి పెంచారు. పెంచిన డీఏ గతేడాది జూన్ 1 నుంచి అమలు కానుంది. ట్రాన్స్ కో ఉద్యోగులకు, ఆర్టిజన్‌లకు, పెన్షర్లకు అమలు చేయనున్నారు. మార్చి నెలకు సంబంధించిన డీఏ ఏప్రిల్ లో అందించనున్నారు.