దేవాదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్ల బదిలీ

దేవాదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్ల బదిలీ

హైదరాబాద్, వెలుగు: దేవాదాయశాఖలో పలువురు అసిస్టెంట్ కమిషనర్​లను (ఏసీ) బదిలీ చేస్తూ ఆ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని శ్రీజగన్నాథ స్వామి రామ్‌‌‌‌‌‌‌‌గోపాల్ ట్రస్ట్ స్పెషల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న ఎ. సులోచన మెదక్ ఎండోమెంట్​అసిస్టెంట్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా బదిలీ అయ్యారు. దీంతో రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ను అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. 

నల్గొండ అసిస్టెంట్ కమిషనర్ బాధ్యతలను కె. భాస్కర్​కు అప్పగించారు. ప్రస్తుతం ఆయన సూపరింటెండెంట్ గా కొనసాగుతుండగా..  పూర్తి అదనపు బాధ్యతలను (ఎఫ్​ఏసీ) ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించనున్నారు. హైదరాబాద్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ కేఎన్. సంధ్యారాణికి సికింద్రాబాద్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్ డిప్యూటీ కమిషనర్​గా కూడా అదనపు బాధ్యతలను కొనసాగించనున్నారు.