ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు కీలక దేవస్థానాల ఈవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.అన్నవరం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ను బదిలీ చేసి.. తిరుపతి ఆర్జేసీగా ఆజాద్ ను నియమించింది.
అలాగే జాయింట్ కమిషనర్ ఎన్వీఎస్ఎన్ మూర్తిని ద్వారకా తిరుమల ఈవోగా నియామించింది. ద్వారకా తిరుమల ఈవోగా ఉన్న త్రినాథ్ ను సింహాచలం ఈవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తిరుమల లడ్డూ వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కీలక ఆలయాల్లో ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.