ఐదుగురు జిల్లా అధికారుల బదిలీ

ఐదుగురు జిల్లా అధికారుల బదిలీ

వికారాబాద్, వెలుగు :  పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖలో సోమవారం భారీగా జిల్లాస్థాయి అధికారులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.  వికారాబాద్  జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న జానకిరెడ్డిని సంగారెడ్డి జడ్పీ సీఈఓగా బదిలీ చేశారు. ఆ  స్థానంలో నిర్మల్ జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న ముప్పిరి సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  వికారాబాద్ జడ్పీ సీఈఓగా నియమించారు.  వికారాబాద్ డీఆర్డీఓగా మెదక్ డీఆర్డీఓగా పని చేస్తున్న ఎ. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను నియమించారు.  వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) గా పనిచేస్తున్న సిహెచ్. తరుణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిజామాబాద్‌కు, నిజామాబాద్ డీపీఓగా పనిచేస్తున్న పెర జయసుధను వికారాబాద్ డీపీఓగా నియమించారు.