మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: ఈ నెల 4న మహబూబ్నగర్నగరంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్‌లో ప్రైవేట్సంస్థల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
గురువారం సంబంధిత పోస్టర్ను తన క్యాంప్ ఆఫీస్లో రిలీజ్చేశారు. అనంతరం జాండ్ర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన న్యూ ఇయర్ క్యాలెండర్‌ను ఆవిష్కిరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.
