గద్వాల, వెలుగు: డ్రైవింగ్ లో నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని కలెక్టర్ సంతోష్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను గురువారం ఆయన తన చాంబర్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రైవింగ్ ను సామాజిక బాధ్యతగా గుర్తిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని చెప్పారు. అనారోగ్య కారణాలతో చనిపోయేవారితో పోల్చితే రోడ్డు ప్రమాదల్లో మృతిచెందే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్టీవో కృష్ణారెడ్డి, ఎంవీఐ రాములు పాల్గొన్నారు.
