ఖమ్మం, వెలుగు : సాగు చేసే రైతులకు సరిపడా యూరియా స్టాక్ జిల్లాలో అందుబాటులో ఉందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గురువారం ఆయన సంబంధిత అధికారులను కలిసి పలు సూచనలు చేశారు.
అన్ని మండలాల్లో సమగ్ర చర్యలు చేపట్టామని, మార్క్ ఫెడ్ ద్వారా యూరియా నిల్వలను ప్యాక్స్, ప్రైవేట్ డీలర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 13 వేల 453 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, ఇప్పటివరకు రైతులకు 22 వేల 472 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వివరించారు.
