పెనుబల్లి ఇన్చార్జి తహసీల్దార్ గా వీరభద్ర నాయక్

పెనుబల్లి ఇన్చార్జి తహసీల్దార్ గా వీరభద్ర నాయక్

పెనుబల్లి, వెలుగు  : పెనుబల్లి మండల ఇన్​చార్జి తహసీల్దార్ గా వీరభద్ర నాయక్ బాధ్యతలు చేపట్టారు. అలాగే ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ లను ఇక్కడ నుంచి బదిలీ చేశారు. చింత గూడెం రెవెన్యూ లోని ప్రభుత్వ భూమి ఘటనలో ఇప్పటికే ఇద్దరు సస్పెన్షన్ అవ్వగా మరొకరిని బదిలీ చేశారు. 

గురువారం పెనుబల్లి రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న భూ భారతి ఆపరేటర్ లక్ష్మారెడ్డి, సీసీఎల్ఏ ఆపరేటర్ రమేశ్​ను బదిలీ చేస్తూ కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు పెనుబల్లి రెవెన్యూ నుంచి ఐదుగురుపై వేటు పడింది.