గద్వాల టౌన్, వెలుగు: గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు సెలక్షన్ గ్రేడ్ హోదా లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న స్థానంలో కొనసాగాలని పేర్కొంది. ఆయన 2013 ఐపీఎస్బ్యాచ్ ఆఫీసర్. ఎస్పీకి ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగులయ్య, ఏఆర్ డీఎస్పీ నరేందర్‌రావు, ఏవో సతీశ్‌కుమార్, ఇతర అధికారులు బొకే ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు.
