
బషీర్ బాగ్, వెలుగు: బషీర్ బాగ్ కూడలిలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు సోమవారం పలువురు ట్రాన్స్ జెండర్లు క్షీరాభిషేకం చేశారు. ట్రాఫిక్వలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లను తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. మహిళలతో సమానంగా మహాలక్ష్మి పథకాన్ని అందిస్తున్నారని, గృహాలక్ష్మి పథకం కింద డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని సీఎం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏదో ఒక విధంగా వివక్షకు గురవుతున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించారు. కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు ప్రేమ్ లీల, సోని, లయ, గౌరి, శృతి, అను, చిన్ని పాల్గొన్నారు.