18 ఏండ్ల మహావృక్షాల ట్రాన్స్‌‌లొకేషన్‌

18 ఏండ్ల మహావృక్షాల ట్రాన్స్‌‌లొకేషన్‌

గోదావరిఖని, వెలుగు: కొత్తగా ఏర్పాటు చేస్తున్న సింగరేణి ఓపెన్‌‌కాస్ట్‌‌లో తొలగించిన 18 ఏండ్ల నాటి రెండు మర్రిచెట్లను ఆర్జీ 1 ఏరియా జీఎం కె.నారాయణ ట్రాన్స్​లొకేషన్ ​చేయించారు. సుమారు రూ.లక్ష ఖర్చు చేసి వాటిని తరలించి జీడీకే 5 ఓసీపీ రోడ్డు పక్కన గురువారం నాటించారు. ఈ సందర్భంగా జీఎం నారాయణ మాట్లాడుతూ తొలగించిన అన్ని చెట్లకు తిరిగి ప్రాణం పోస్తామన్నారు. గోదావరిఖనిలో ట్రాన్స్‌‌ లొకేషన్ పద్ధతి ద్వారా ఏడు మర్రిచెట్లు, 65 మామిడి, 20 ఎర్రచందనం చెట్లను నాటినట్టు చెప్పారు. చెట్లను నాటే ముందు వేళ్లతో సహా పెకిలించి కొమ్మలను కత్తిరిస్తారని, ఆ కొమ్మలకు బావిస్టాన్, బ్లూ కాపర్ అనే మందులను పూస్తారని తెలిపారు. పెద్ద గొయ్యిని తవ్వి అందులో వర్మికంపోస్ట్, సింగిల్ సూపర్ ఫాస్పెట్ వేసి చెట్లను నాటుతారన్నారు. ఇలా చేసిన వృక్షం 3 నెలలలోపే చిగురిస్తుందన్నారు.