హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక లోడ్‌తో వెళ్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (జేటీసీ) చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
100 వాహనాలను సీజ్ చేశారు. ఓవర్ లోడ్‌తో రెండోసారి పట్టుబడితే వాటి పర్మిట్లతో పాటు డ్రైవర్ లైసెన్స్‌ను కూడా సస్పెండ్ చేస్తామని జేటీసీ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి రాజీపడబోమని స్పష్టం చేశారు.
