మేం మీ పాలేర్లం కాదు..నువ్ కుసోమ్మంటే కుసుంటమా?: మంత్రి పొన్నం ప్రభాకర్

మేం మీ పాలేర్లం కాదు..నువ్ కుసోమ్మంటే కుసుంటమా?: మంత్రి పొన్నం ప్రభాకర్
  •  12 ఏండ్ల పాపతో తెచ్చి బ్లాక్ మెయిల్ చేసినవ్
  • పాడి పై మంత్రి పొన్నం ఫైర్ 

హైదరాబాద్: రవాణాశాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పాడి  కౌశిక్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రి సభలో మాట్లాడుతూ పొన్నంను కూర్చోవాలంటూ కౌశిక్ రెడ్డి రన్నింగ్ కామెంటరీ చేశారు.  దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.   తాము భయపెడితే  భయపడే రకం కాదన్నారు.  మీరు కూర్చో అనగానే కూర్చోడానికి తాము పాలేర్లము కాదని చెప్పారు. తనకు ఓట్లు వేయకపోతే భార్య పిల్లలతో కలిసి శవయాత్ర చూడాల్సి వస్తుందంటూ ఓటర్లను బెదిరించిన  వ్యక్తి తనను కూర్చోమని  బెదిరిస్తారా అని మండిపడ్డారు. పన్నెండేండ్ల పాపను తెచ్చి బ్లాక్ మెయిల్ చేసిన పాడి తనకు చెబుతారా..? అంటూ ప్రశ్నించారు.   మాజీ  మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.  కడియం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.  కుర్చీవేసుకోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేసీఆర్  మాటలు ఏమయ్యాయని నిలదీశారు.  గౌరవెల్లి కింద కాల్వలు ఎక్కడున్నాయని పొన్నం ప్రశ్నించారు.