తడి పొడి మాయమైంది.. ఉయ్యాలగా మారింది

తడి పొడి మాయమైంది.. ఉయ్యాలగా మారింది

సిటీని శుభ్రంగా మార్చేందుకు బల్దియా స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా తడి చెత్త.. పొడి చెత్తపై దృష్టి పెట్టింది. ఇంటికి రెండు డబ్బాలు ఇవ్వడంతో పాటు అవగాహన కూడా కల్పించింది. మెయిన్​ రోడ్ల వెంట రెండు చెత్త డబ్బాలను కూడా ఏర్పాటు చేసింది. కానీ వాటిని పట్టించుకోకపోవడంతో చాలా మటుకు నిరుపయోగంగా మారిపోతున్నాయి. కొన్నిచోట్ల ఆనవాళ్లు కూడా లేకుండా పోతున్నాయి. మాదాపూర్‌‌లోని అరుణోదయ కాలనీలో ఏర్పాటు చేసిన చెత్త డబ్బా మాయమై ఓ పిల్లాడికి ఊయలగా పనిచేస్తోంది. – హైదరాబాద్​, వెలుగు 

trash can changed as swing