మునుపటిలా టూర్లకి...

మునుపటిలా టూర్లకి...

ఈ ఏడాది ట్రావెల్​ థీమ్​ ‘గో బిగ్​’. అంటే... ‘చూడాల్సిన ప్లేస్​ల లిస్ట్​ పెద్దది’ అని అర్థం. వరల్డ్ ట్రావెల్​, టూరిజం కౌన్సిల్​(డబ్లూటిటిసి) ఈ థీమ్​ని తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనా రిస్ట్రిక్షన్స్​ని ఎత్తేశాయి. విదేశీ టూరిస్టుల్ని రానిస్తున్నాయి కూడా. దాంతో రెండేండ్లుగా టూర్​ వేయని వాళ్లు  కొత్త ప్లేస్​ల్ని చూసేందుకు రెడీ అవుతున్నారు. వాళ్ల ట్రిప్​ లిస్ట్​లో చాలా ప్లేస్​లు ఉండొచ్చు అంటున్నారు ట్రావెల్​ ఎక్స్​పర్ట్స్. ఇప్పడిప్పుడే మళ్లీ టూరిస్ట్ ప్లేసులు  సందడిగా కనిపిస్తున్నాయి. సమ్మర్, రెయినీ సీజన్​ ట్రిప్  బుకింగ్స్​ ఈ వారంలో ఎక్కువ అయ్యాయని ట్రావెల్​ ఏజెంట్స్​, ఆపరేటర్స్ చెప్తున్నారు. ప్యాండెమిక్​ తర్వాత హోటల్​, ఫ్లయిట్​ ఛార్జీలు తగ్గడం కూడా ట్రావెలర్స్​కి కలిసొస్తుందని అంటున్నారు వీళ్లు. 

ఎడ్యుకేషన్​ టూర్లు 
ఇంతకుముందుతో పోల్చితే టూరిస్ట్​ల ఛాయిస్​లు మారాయి. వాళ్ల ఇంట్రెస్ట్​కి తగ్గట్టుగానే ట్రావెల్​ కంపెనీలు, హోటళ్లు ఫెసిలిటీస్​ కల్పిస్తున్నాయి. కొన్ని హోటల్స్​ కీలెస్​ చెకిన్, డిజిటల్​ స్టాఫ్​ కమ్యూనికేషన్, రోబోస్​తో  రూమ్ డెలివరీ​ సర్వీసులు ఆఫర్​ చేస్తున్నాయి. పేరెంట్స్​ కూడా పిల్లల కోసం ఎడ్యు–వెకేషన్ ట్రిప్​ ప్లాన్​ చేస్తున్నారు. 3 నుంచి 17 ఏండ్లలోపు పిల్లల కోసం రెండు వారాలు ఎడ్యుకేషనల్​ సమ్మర్​ క్యాంప్స్ పెడుతున్నాయి పోర్చుగల్​లోని కొన్ని రిసార్టులు. ఈ ఏడాది 150 శాతం మంది ఎక్కువ టూరిస్ట్​లు ఫ్లయిట్​లో ట్రావెల్ చేయొచ్చని అంటోంది ‘ది ఇంటర్నేషనల్​ ఎయిర్​ ట్రాన్స్​పోర్ట్ అసోసియేషన్’.

మునుపటిలా టూర్లకి...
‘‘ఈ ఏడాది టూరిస్ట్​ల సంఖ్య పెరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే... కరోనా కేసులు చాలా తగ్గిపోయాయి. చాలామంది వ్యాక్సిన్​ రెండు డోసులతో పాటు బూస్టర్​ డోస్​ కూడా వేసుకున్నారు. పైగా చాలాదేశాలు ట్రావెల్​ బ్యాన్​ ఎత్తేశాయి. దాంతో టూరిస్ట్​లు మునుపటిలా నచ్చిన ప్లేస్​లను చుట్టేస్తారని  నమ్ముతున్నాం” అని చెప్తోంది డబ్ల్యూటిటిసి సీఇవో జులియా సింప్సన్​.