డిప్రెషన్​కు ఇచ్చే ట్రీట్​మెంట్​తో బ్రెయిన్​కు మేలు

డిప్రెషన్​కు ఇచ్చే ట్రీట్​మెంట్​తో బ్రెయిన్​కు మేలు

బెర్లిన్: డిప్రెషన్ కోసం ఇచ్చే ట్రీట్​మెంట్లు, మనిషి మెదడును మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో బ్రెయిన్ కనెక్టివిటీ పెరుగుతుందని జర్మనీలోని మ్యూన్‌‌‌‌‌‌‌‌స్టర్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. డిప్రెషన్​ ట్రీట్​మెంట్​తీసుకోక ముందు ఉన్న బ్రెయిన్​ కనెక్టివిటీ.. చికిత్స తీసుకున్న తర్వాత మరింత పెరిగిందని వివరించారు. ఆస్ట్రియా, వియన్నాలోని యూరోపియన్ కాలేజ్ ఫర్ న్యూరో సైకో ఫార్మాకాలజీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఈ స్టడీకి సంబంధించిన నివేదికను అందజేసినట్టు రీసెర్చర్స్ తెలిపారు. యూత్​లో బ్రెయిన్​ స్ర్టక్చర్​ సాధారణంగానే దృఢంగా ఉంటుందని వివరించారు. డిప్రెషన్​ ట్రీట్​మెంట్​ మనిషి మెదడు సామర్థ్యాన్ని మార్చినట్టు గుర్తించామని స్టడీ లీడ్​ రీసెర్చర్​ ప్రొఫెసర్​ జోనాథన్​ రెప్పల్​ తెలిపారు. డిప్రెషన్​ కోసం చేసే ట్రీట్​మెంట్, బ్రెయిన్​ కనెక్టివిటీ పెంచడంతో పాటు డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుందని వివరించారు.

109 మంది పేషెంట్ల​పై స్టడీ
డిప్రెషన్​తో బాధపడుతున్న 109 మంది పేషెంట్స్​పై స్టడీ చేశామని, తర్వాత వారి డేటాను హెల్దీగా ఉన్న 55 మందితో పోల్చామని రెప్పల్​ చెప్పారు. బ్రెయిన్​లో ఏ పార్ట్.. వేరేదాంతో కమ్యూనికేట్​ అవుతుందో తెలుసుకునేందుకు ఎంఆర్​ఐ స్కాన్​ చేశామని వివరించారు. డిప్రెషన్​కు గురైన వారు ఎలక్ర్టోకాన్వల్సిన్​ థెరపీ (ఈసీటీ) ట్రీట్​మెంట్​ తీసుకుంటే మరికొందరు మందులు తీసుకుంటారన్నారు. ట్రీట్​మెట్​కు​ ముందు, ఆ తర్వాత బ్రెయిన్​ పనితీరును పరీక్షిస్తే.. చికిత్స తర్వాతే బ్రెయిన్​ కనెక్టివిటీ పెరిగినట్టు గుర్తించామన్నారు. అదెలా పెరిగిందో చెప్పేందుకు తమ వద్ద వివరణ లేదని రెప్పల్​ వివరించారు.