132 టన్నుల ఈ రాయిని ఒక్క చేత్తో కదిలించొచ్చు..

132 టన్నుల ఈ రాయిని ఒక్క చేత్తో కదిలించొచ్చు..

దీని పేరు ట్రెంబ్లింగ్ స్టోన్. సుమారు132 టన్నుల బరువు ఉంటుంది. కానీ చేతితో కదిలిస్తే కదులుతుంది. ఈ విచిత్రమేంటో అర్థం కాక దాన్ని చూసేందుకు ‘క్యూ’ కడుతున్నారు. ఫ్రాన్స్‌‌‌‌లోని హ్యూల్‌‌‌‌గోట్ అడవిలో ఉన్న ట్రెంబ్లింగ్ స్టోన్.. ఫేమస్ టూరిస్ట్ స్పాట్. 

వంద టన్నులకు పైగా బరువు ఉండే ఈ రాయిని సులువుగా కదిలించొచ్చు. అయితే, ఒక యాంగిల్ నుంచి కదిలిస్తేనే ఈ రాయి కదులుతుంది. రాయి అమరిక వెనుక సైన్స్ ఉండడమే దీనికి కారణం. ఈ  ట్రెంబ్లింగ్‌‌‌‌ స్టోన్‌‌‌‌ చదునుగా ఉన్న మరోరాయిపై ఉంటుంది. ఒక మూల నుంచి కదిపితే రాయి పైకి, కిందికి ఊగుతుంది. దీన్ని చూడ్డానికి టూరిస్టులు వెళ్తుంటారు.