ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం.. రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదు

ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం.. రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్ సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. గురువారం ఉదయం 9.04కు నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హర్యానాతోపాటు పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైంది. హర్యానాలోని జజ్జర్ కు ఈశాన్య దిశగా 4కిలోమీటర్ల దూరంలో, భూమి నుంచి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు  అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని చెప్పారు. భూమి కంపించడంతో అనేక చోట్ల ప్రజలు, కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. భూకంపంపై ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు ఆందోళనకు గురికావొద్దని, ఇలాంటి సమయాల్లో లిఫ్ట్‌‌‌‌కు బదులుగా మెట్లను ఉపయోగించాలని సూచించింది.