తాడ్వాయి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లను గౌరవిస్తూ అస్తిత్వం కోల్పోతున్న ఆదివాసీల మూలాలతో మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల ప్రాంగణ అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ కుటిల బుద్ధితో రాజకీయ రంగు నులిమి అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాల నాయకులు విమర్శించారు. మంగళవారం ఆదివాసీ సంఘాల జాక్ చైర్మన్ దబ్బగట్ల సుమన్ అధ్యక్షతన హరిత హెూటల్ లో జరిగిన సమావేశంలో ఆదివాసీ అనుబంధ సంఘాల నాయకులు మాట్లాడుతూ మేడారంలో 3 నుంచి 7 గొట్ల పూర్వ చరిత్ర తెలుపుతూ 5000 బొమ్మలతో గుడి నిర్మాణం అవుతుందన్నారు.
ఆది సహించలేకనే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మేడారం అభివృద్ధి పనులపై రాజకీయం చేస్తుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో తుడుం దెబ్బ ప్రధాన కార్యదర్శి పోడియం బాబు, మేడారం జాతర చైర్మన్ అరేంలచ్చుపటేల్, గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముద్దబోయిన రవి, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సాయం కోటేశ్వరరావు, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య, వంక నరేష్ తదితరులు పాల్గొన్నారు.
