మహారాష్ట్ర ఆర్టీసిలో లేడీ డ్రైవర్లు

మహారాష్ట్ర ఆర్టీసిలో లేడీ డ్రైవర్లు

పుణే: మహారాష్ట్ర స్టేట్‌‌‌‌ రోడ్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ (ఎంఎస్‌‌‌‌ఆర్టీసీ) బస్సులను త్వరలో మహిళా డ్రైవర్లు నడపనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎంఎస్‌‌‌‌ఆర్టీసీ కొత్త రికార్డు సృష్టిస్తోంది.163 మంది ఆడవాళ్లకు డ్రైవింగ్‌‌‌‌లో ట్రైనింగ్‌‌‌‌ ఇస్తోంది. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌‌‌‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్రైనింగ్‌‌‌‌ తర్వాత ఆడవాళ్లను డ్రైవర్లుగా నియమిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్‌‌‌‌‌‌‌‌ రావత్‌‌‌‌ చెప్పారు. ఇలాంటి ప్రోగ్రాం ప్రారంభించడం దేశంలో ఇదే మొదటిసారని ఆయన అన్నారు. లేడీ డ్రైవర్ల రక్షణ కోసం తగిన చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. నైట్‌‌‌‌ షిఫ్ట్‌‌‌‌లలో కష్టం రాకుండా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ట్రైనింగ్‌‌‌‌ తీసుకుంటున్న ఆడవాళ్లలో గిరిజనులు కూడా ఉన్నారు.

పుణే: మహారాష్ట్ర స్టేట్‌‌‌‌ రోడ్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ (ఎంఎస్‌‌‌‌ఆర్టీసీ) బస్సు