కంటోన్మెంట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ ఆర్గనైజేషన్స్ నాయకులు ఘనంగా సన్మానించారు. బుధవారం మారేడుపల్లిలోని దివంగత నేత కాకా వెంకటస్వామి నివాసంలో ఎమ్మెల్యే వివేక్ ను కలిసి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరరాజ్ మాట్లాడుతూ..
పెద్దపెల్లి లోక్సభ నియోజకవర్గంలోని అన్ని వర్గాలను, ఏడుగురు ఎమ్మెల్యేలను సమన్వయ పరిచి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించడంలో ఎమ్మెల్యే వివేక్కీలక పాత్ర పోషించారన్నారు. ఫూలే, అంబేద్కర్ స్ఫూర్తితో, కాకా వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో కప్పా కృష్ణగౌడ్, మహ్మద్ చాంద్ భాషా, మాణిక్ డోంగ్రే తదితరులు పాల్గొన్నారు.
