టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రదానం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చిత్రపటానికి  పిండ ప్రదానం
  • రాహుల్ గాంధీకి అండగా నిలిచిన కేసీఆర్ ను అవమానిస్తారా ?

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన పీసీసీ రేవంత్‌రెడ్డికి టీఆర్ఎస్ రాష్ట్ర సోష‌ల్ మీడియా నేతృత్వంలో టీఆర్ఎస్ ఐటీ సెల్ ఆధ్వ‌ర్యంలో పిండ ప్ర‌దానం చేశారు. అనంతరం మూసీ నదిలో ఆ పిండాలను కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా రాష్ట్ర క‌న్వీన‌ర్‌ స‌తీష్‌రెడ్డి మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్య‌తిరేకి అయిన చంద్ర‌బాబు పెంపుడు కుక్క  అని మండిపడ్డారు. తన పుట్టుకపై రాహుల్ గాంధీని బీజేపీ అవమానిస్తే.. తమ నాయకుడు రాహుల్ గాంధీకి అండగా నిలిచిన విషయం మరిచిపోయావా అంటూ ప్రశ్నించారు. అలాంటి గొప్ప మనసున్న సీఎం కేసీఆర్ మరణం కోరడానికి సిగ్గుపడాలని మనసు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. బాధ్యతగల పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అవహేళన చేస్తూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని...లేదంటే రేవంత్ రెడ్డిని అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు.  ఈనెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా  మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చామని తెలిపారు.

ఇవి కూడా చదవండి: 

కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎప్పటికీ కలిసే ప్రసక్తి లేదు

పెద్ద పారిశ్రామికవేత్తలే ప్రయోజనం పొందుతున్నారు