అవని ఆనందం: విశ్వంభర మూవీలో త్రిష క్యారెక్టర్ రివీల్..

అవని ఆనందం: విశ్వంభర మూవీలో త్రిష క్యారెక్టర్ రివీల్..

కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై మూడేళ్లు అయినా ఇప్పటికీ  వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది త్రిష. ప్రస్తుతం చిరంజీవికి జంటగా ‘విశ్వంభర’ చిత్రంతో పాటు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, మోహన్ లాల్‌‌తో ‘రామ్’ సూర్య 45వ సినిమాలో నటిస్తోంది.  బ్యాక్ టు బ్యాక్  ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆదివారం త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల నుంచి  క్రేజీ అప్‌‌డేట్స్‌‌ను అందించారు మేకర్స్.  ‘విశ్వంభర’ చిత్రంలో తన పాత్రను పరిచయం చేస్తూ బర్త్‌‌డే విషెస్ చెప్పింది టీమ్.  

అవని పాత్రలో త్రిష కనిపించనుందని రివీల్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో చీరకట్టుకుని  ట్రెడిషినల్ గెటప్‌‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో  యూవీ క్రియేషన్స్ సంస్థ  నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆషిక రంగనాథ్ మరో​ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  ఇషాచావ్లా, రమ్య, కునాల్ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2006లో వచ్చిన ‘స్టాలిన్’ తర్వాత చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.  

మరోవైపు త్రిష నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌తో తనకు బర్త్‌‌డే విషెస్ తెలియజేశారు మేకర్స్. కమల్ హాసన్‌‌ లీడ్‌‌ రోల్‌‌లో మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష ఇంపార్టెంట్ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించనుందని రివీల్ చేశారు. శింబు, అభిరామి  కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.