తమిళనాడు పాలిటిక్స్ ఎంత ఆసక్తికరంగా మారాయో, అదే స్థాయిలో హీరోయిన్ త్రిష పేరు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. గత కొంతకాలంగా హీరో దళపతి విజయ్తో త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
లేటెస్ట్గా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేడుకలో త్రిష ప్రత్యేకంగా కనిపించడంతో, వీరిద్దరి మధ్య బలమైన అనుబంధం ఉందన్న ప్రచారం మరింత ఊపందుకుంది. దీనికి తోడు విజయ్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన ఈ వేడుకకు, ఆయన భార్య సంగీత, పిల్లలు హాజరుకాకపోవడం కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
అదే సమయంలో త్రిష వేడుకలో ముందువరుసలో కనిపించడం, విజయ్ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మెలగడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే త్రిషపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలకు “The love is always louder” అంటూ క్యాప్షన్ పెట్టి సినీ, రాజకీయ వర్గాల్లో హీట్ పెంచేసింది. “ప్రేమ ఎప్పుడూ బిగ్గరగా వినిపిస్తుంది” అని బ్లూ కలర్ లవ్ ఎమోజీ జోడించింది.
ఆ తర్వాత, తనను ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు తన స్టైల్ మరియు హెయిర్ టీమ్‌లకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా, ట్రోల్స్‌కు త్రిష పరోక్షంగా సమాధానం ఇచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.
ఇకపోతే, విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో త్రిష ఎమోషనల్ అయింది. ఈ వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే, విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్తో సహా కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించిన వీడియోలు కూడా వైరల్గా మారాయి.
Not every tear needs a story, and not every bond needs a label.@trishtrashers getting emotional while Vijay took oath as CM was simply a beautiful human moment filled with pride, respect, and years of friendship. ✨#Trisha #ThalapathyVijay #TVK #TamilNadu pic.twitter.com/KWXerpKRAB
— Trishianvenkat 👸🙇♂️🙏 (@Trishianvenkat) May 10, 2026
ఎప్పటికీ విజయ్‌కే నా మద్దతు..
ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన త్రిష తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. “తమిళనాడు సీఎం దళపతి విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా మద్దతు ఎప్పటికీ విజయ్‌కే ఉంటుంది,” అంటూ ఆమె శుభాకాంక్షలు తెలిపింది. అలాగే విజయ్‌కు మద్దతు ఇచ్చిన తమిళనాడు ప్రజలకు కూడా ఆమె ధన్యవాదాలు తెలియజేసింది.
చీరకట్టులో త్రిష హుందాతనం..
విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ హుందాతనం, మోడర్న్ స్టైల్ కలగలిసిన ఆమె లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. త్రిష సముద్రపు నురుగు నీలం రంగు కంచివరం చీరలో మెరిసిపోయింది. సున్నితమైన బంగారు అంచుతో కూడిన ఆ చీరకు, పూల డిజైన్లతో అలంకరించిన గోల్డ్-బేజ్ బ్రోకేడ్ బ్లౌజ్‌ను జత చేసింది.
ఆభరణాల విషయంలో కూడా త్రిష ఎంతో క్లాసీగా కనిపించింది. మధ్యలో కెంపు రత్నంతో కూడిన డైమండ్ చోకర్, దానికి సరిపోయే స్టడ్స్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేశాయి. సంప్రదాయ దక్షిణ భారతీయ స్టైల్‌లో జుట్టును చక్కగా ముడి వేసుకుని, మల్లెపూలతో అలంకరించుకుంది. కార్యక్రమం మొత్తం త్రిష చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుని వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
