Faria Abdullah: పెళ్లిపై ‘చిట్టి’ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్.. ఫ్యూచర్‌లో ఆ పదానికి అర్థమే మారిపోతుందంటూ స్టేట్‌మెంట్స్!

Faria Abdullah: పెళ్లిపై ‘చిట్టి’ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్.. ఫ్యూచర్‌లో ఆ పదానికి అర్థమే మారిపోతుందంటూ స్టేట్‌మెంట్స్!

‘జాతిరత్నాలు’ సినిమాలో ‘చిట్టి’ పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తన చలాకీతనం, ఈజ్, అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో టాలీవుడ్‌లో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. లేటెస్ట్ గా ఈ ఆరడుగుల బ్యూటీ.. లవ్, మ్యారేజ్, లైఫ్‌పై చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

 పెళ్లిపై క్రేజ్ తగ్గిపోతోంది..

ఫరియా రీసెంట్ ఇంటర్వ్యూలో పెళ్లిపై చాలా బోల్డ్ అండ్ ప్రాక్టికల్ ఒపీనియన్‌ను షేర్ చేసింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. "నా దృష్టిలో ప్రేమ, పెళ్లి అనేవి వేరు వేరు చాప్టర్లు. మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారనే ఫీలింగ్ చాలా బ్యూటిఫుల్. లైఫ్‌లో ఒక తోడుండటం అవసరమే. కానీ, పెళ్లి అనేది ఒక మనిషిని పూర్తిగా మార్చేసే బంధం. అయితే, ఇప్పటి జనరేషన్‌లో పెళ్లిపై క్రేజ్ తగ్గిపోతోంది. ఫ్యూచర్‌లో మ్యారేజ్ అనే పదానికి డెఫినేషనే మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ చెప్పుకొచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న యువత.. ప్రస్తుతం సంప్రదాయ బంధాలపై అంతగా ఆసక్తి చూపడంలేదని అభిప్రాయపడింది.

క్రూయిజ్ షిప్‌లో షెఫ్‌గా ..

సినిమాల్లోకి రాకముందు ఫరియా కలలు చాలా డిఫరెంట్‌గా ఉండేవట. ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే.. ట్రావెలింగ్ అంటే ప్రాణమిచ్చే ఈ భామ, ఒక పెద్ద క్రూయిజ్ షిప్‌లో షెఫ్ (Chef) లా సెటిల్ అయ్యేదట లేదా ఈవెంట్ మేనేజర్ అయిపోయేదానంటూ చెప్పుకొచ్చింది. కుదరకపోతే గిప్సీలా తిరుగుతూ ట్రావెల్ వ్లాగర్ గా మారిపోయేదాన్ని అంటూ తన మనసులోని క్రేజీ కోరికలను బయటపెట్టింది.

రూమర్లపై పంచ్..

నెట్టింట వచ్చే గాసిప్స్‌పై ఫరియా చాలా కూల్‌గా స్పందించింది. సోషల్ మీడియా లిమిట్‌లో ఉంటేనే అందం. రూమర్స్, గాసిప్స్ వస్తూనే ఉంటాయి.. వాటిని లైట్ తీసుకుని మన పని మనం చేసుకుంటూ పోవాలి అంటూ గట్టి క్లారిటీ ఇచ్చింది ఫరియా. హైదరాబాద్‌కు చెందిన ఈ మల్టీటాలెంటెడ్ బ్యూటీ కేవలం నటి మాత్రమే కాదు.. అద్భుతమైన క్లాసికల్ & వెస్ట్రన్ డ్యాన్సర్, రైటర్ కూడా.

►ALSO READ | Dimple Hayathi: ‘నా బొ***లో ప్రపంచం చల్ తీ.. మందారం ఈడ’.. వైరల్ అవుతున్న ‘డింపుల్’ లుక్

 లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతుండగా ఈమెలోని స్పార్క్‌ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ గుర్తించి ‘జాతిరత్నాలు’ ఆడిషన్స్‌కు పిలిచారు. అలా ఓవర్‌నైట్ స్టార్ అయిన ఈ పొడుగు సుందరి.. క్యారెక్టర్ డిజైన్ బాగుంటే నిడివి ఎంత చిన్నదైనా, ఎలాంటి పాత్రలోనైనా మెరవడానికి రెడీ అంటూ తన ప్రొఫెషనలిజాన్ని చాటుకుంది. ఏదేమైనా.. ఈ చిట్టి ముచ్చట్లు ఇప్పుడు ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఎలాంటి వాడిని పెళ్లిచేసుకోనుందో చూడాలి.