శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ రూరల్ యాక్షన్ డ్రామా నుంచి డింపుల్ హయతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో డింపుల్ పోషిస్తున్న ‘మందారం’ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“నా బొ***లో ప్రపంచం చల్ తీ! మందారం ఈడ..” అంటూ వచ్చిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ప్రపంచం కోరుకున్న అందం.. కానీ ఎప్పటికీ అర్థం చేసుకోలేని ఆత్మ” అంటూ డింపుల్ పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేశారు.
ఎర్రచీరలో డింపుల్ హుందాగా కనిపిస్తూ ఆకర్షించేలా ఉంది. కేవలం ఒకే ఒక సంప్రదాయ ఆభరణం, గంభీరమైన ఎక్స్ప్రెషన్ ఆమె పాత్రపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. రీసెంట్గా అనుపమ పాత్రను ‘కందుల సులోచన రాణి’గా పరిచయం చేస్తూ విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెస్ చేసింది. ఇక ఇప్పుడు డింపుల్ ఫస్ట్ లుక్కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
“నా బొ***లో ప్రపంచం
— Sampath Nandi (@IamSampathNandi) May 11, 2026
చల్ తీ!
మందారం ఈడ….”
Introducing M A N D A R A M 🌺❤️🔥✨
Beauty the world desired..
A soul it never understood.
Powered by the fearless @DimpleHayathi 💫#Bhogi🔥
A #SharwaSampathBloodFest💥
Charming Star @ImSharwanand @anupamahere @KKRadhamohan… pic.twitter.com/b9vH3ZXdHB
960ల నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో సాగే ఈ కథ యాక్షన్, ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
Pure G R A C E ✨
— Sampath Nandi (@IamSampathNandi) May 9, 2026
wrapped in
G U N P O W D E R 🔥@DimpleHayathi💫
Unveiling on May 11th, 11:07 AM ❤️🔥
A #SharwaSampathBloodFest💥#Bhogi In Cinemas from August 28, 2026.
Charming Star @ImSharwanand @anupamahere @KKRadhamohan @rohitpathak99 @dhilipaction @kishorkumardop… pic.twitter.com/YKsOnCD47F
