
దక్షిణాది సినీ ప్రియుల మనసు దోచిన కథానాయిక త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా తెలుగు, తమిళం చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన ఈ బ్యూటీ.. త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వ్యాపారవేత్తతో పెళ్లి?
త్రిష తల్లిదండ్రులు ఆమె కోసం ఓ మంచి సంబంధాన్ని ఖాయం చేశారని టాక్ వినిస్తోంది. ఆ వ్యక్తి చండీగఢ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త. అయితే, ఆ వ్యక్తి గురించి ఇంకా బయటకు మాత్రం రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సమాచారం ప్రకారం ఆ యువకుడు ఆస్ట్రేలియాలో స్థిరపడి బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు తన వ్యాపారాన్ని ఇటీవల భారత్ తో విస్తరించాడని టాక్. కానీ ఈ రెండు కుటుంబాలకు చాలా ఏళ్లుగా పరిచయం ఉండటంతో, పెద్దల అంగీకారంతోనే ఈ బంధం ముందుకు సాగుతోందని సమాచారం. తమ తల్లిదండ్రులు చూసిన ఈ సంబంధానికి త్రిష ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.
ALSO READ : 2025 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్కి సర్వం సిద్ధం..
పెళ్లిపై త్రిష ఏం చెప్పిందంటే?
తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచే త్రిష, ఇటీవల వివాహం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సరైన వ్యక్తి దొరికితే పెళ్లికి సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేసింది. అయితే, ఆ సరైన సమయం ఇంకా రాలేదు అని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం వస్తున్న ఊహగానాలపై త్రిషగాని ఆమె తల్లిదండ్రులు మాత్రం ఇంకా స్పందించలేదు.
తొలి ఎంగేజ్‌మెంట్
త్రిష పెళ్లి వార్తలు వినిపించినప్పుడల్లా, ఆమె గతంలో రద్దయిన ఎంగేజ్‌మెంట్ ప్రస్తావన రావడం సహజం. 2015లో ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత నటనను కొనసాగించే విషయంపైనే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో అనూహ్యంగా పెళ్లి రద్దయింది. అప్పటి నుంచి త్రిష తన కెరీర్ పైనే దృష్టి పెట్టింది.
విజయ్‌తో రూమర్స్
త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ప్రేమాయణం నడుపుతున్నారనే రూమర్లు సినీ వర్గాల్లో వినిపించాయి. ' 2000వ దశకంలో 'ఘిల్లి', 'తిరుపాచి' వంటి వరుస విజయాలతో వీరిద్దరూ కోలీవుడ్‌లో అత్యంత ఇష్టమైన జోడీగా మారారు. వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసిన అభిమానులు నిజ జీవితంలోనూ ప్రేమ చిగురించిందని నమ్మారు. అయితే, తామిద్దరం మంచి స్నేహితులమే అని ఇద్దరూ ఎప్పుడూ స్పష్టం చేస్తూ వచ్చారు . గతేడాది వచ్చిన 'లియో'తో వారిద్దరూ కలిసి నటించడం అభిమానులకు గొప్ప ట్రీట్‌గా నిలిచింది.
ప్రస్తుతం త్రిష, కమల్ హాసన్‌తో కలిసి 'ఠగ్ లైఫ్'లో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన భారీ చిత్రం ‘విశ్వంభర’ లో నటిస్తోంది. అదే సమయంలో తమిళంలో ‘కరుప్పు’ అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. లేటెస్ట్ గా త్రిష పెల్లికి సంబంధించి జరుతున్న ప్రచారంలో నిజం ఎంత అని తెలియాలంటే మరి కొంతకాలం వేచిచూడక తప్పదు.