Telangana Great : 63 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం.. ఈ గుట్ట.. ఆ ఊరికే ఎట్రాక్షన్..!

Telangana Great : 63 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం.. ఈ గుట్ట.. ఆ ఊరికే ఎట్రాక్షన్..!

కాగజ్​నగర్ పట్టణానికే స్పెషల్ ఎట్రాక్షన్ త్రిశూల్ పహాడ్ గుట్ట .. దీని చుట్టూ పచ్చని అందాలు,..  నిలువెత్తులో ఉన్న  ఆంజనేయస్వామి విగ్రహం చూడ్డానికి రెండు కళ్లు చాలవు. అంతేకాదు ఈ గుట్ట ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విలసిల్లుతోంది. ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఇక్కడ, ఆసిఫాబాద్ జిల్లా  కాగజ్​నగర్​కు కొత్తవాళ్లు ఎవరొచ్చినా ఈ గుట్ట చూడాల్సిందే.

ALSO READ | ఆధ్యాత్మికం: ఇందిర ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏంచేయాలి..

త్రిశూల్​ పహాడ్​ గుట్టపై ఏర్పాటు చేసిన 63 ఆ అడుగుల అంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం ఇక్కడ స్పెషల్ ఎట్రాక్షన్.  ఈ విగ్రహాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఆంజనేయస్వామిని దర్శించుకు నేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.అంతకాదు.. పండుగ రోజుల్లో... ముఖ్యమైన రోజుల్లో  అక్కడ  ప్రత్యేక పూజల చేస్తారు. అన్నదాన కార్యక్రమం చేస్తారు.


పంచ ఆలయాలు

గుట్టపై అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. నిలువెత్తు అభయాంజయస్వామితో పాటు సత్యనారాయణ స్వామి, దుర్గామాత.. గణేశ్, సాయిబాబా ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయాల్లో ప్రతిరోజు జరిగే పూజలను చూసేందుకు భక్తులు  ,  పట్టణ ప్రజలు వస్తుంటారు. అప్పుడప్పుడు  సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు.

ఎటు చూసినా పచ్చదనమే

త్రిశూల్ పహాడ్​  గుట్ట వర్షాకాలంలోనే కాదు అన్ని కాలాల్లో పచ్చని చెట్లతో కళకళలాడుతుంటుంది. గుట్టు చుట్టూ అనేక రకాల వృక్షాలు ఉన్నాయి. వాటి మధ్య  శ్రీకృష్ణగోశాల' ఉంది. ఇందులో రెండు గుర్రాలు కూడా పెంచుతున్నారు.

రావణదహనం

ప్రతిఏటా దసరా వేడుకలప్పుడు ఇక్కడ 'రావణ దహనం' నిర్వహించడం అనవాయితీ. అందుకోసం త్రిశూల్ పహాడ్​ గుట్టపైన ప్రత్యేకంగా రావణుడి. విగ్రహ ఆకారాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ గుట్ట మీద పరిసరాల్లో జవహర్ నవోదయ విద్యాలయం. ప్రభుత్వ ఆఫీసులు కూడా ఉన్నాయి. దాంతో ఇక్కడ రోజూ సందడిగా ఉంటుంది.