
‘సర్కారు వారి పాట’ చిత్రంతో సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ బాబు.. తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించాల్సి ఉంది. కానీ ఆయన ఫ్యామిలీలో జరిగిన వరుస ఇన్సిడెంట్స్‌తో షూటింగ్‌కి బ్రేక్ పడుతూ వచ్చింది. ఆ విషాదం నుండి తేరుకునేందుకు తిరిగి షూటింగ్స్‌తో బిజీ అవుతున్నాడు. ఇటీవలే ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్న మహేష్.. బ్యాక్ టు వర్క్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. త్రివిక్రమ్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి.. వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో షూట్‌కి మరింత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది.
ఈలోపు మహేష్‌బాబుతో పాటు తమన్, త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ దుబాయ్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారట. అలాగే ఇందులో విలన్ పాత్రకోసం బాలీవుడ్ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు సంజయ్ దత్‌ను తీసుకున్నారని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు సైఫ్ అలీఖాన్‌ను ఫిక్స్ చేశారనే టాక్ ప్రచారంలో ఉంది. దీనిపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న మూడో మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది పూర్తవగానే రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు మహేష్. వచ్చే ఏడాది జూన్‌లో ఈ మూవీ సెట్స్‌కి వెళ్లనుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది తెరకెక్కనుంది.