Aadarsha Kutumbam: పెయిడ్ ప్రీమియర్స్ లేవు.. 'ఆదర్శ కుటుంబం' రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ!

Aadarsha Kutumbam: పెయిడ్ ప్రీమియర్స్ లేవు.. 'ఆదర్శ కుటుంబం' రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ!

విక్టరీ వెంకటేష్ , శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.  

ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడప్  చేశారు మేకర్స్ . ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ లేటెస్ట్ గా కీలక అప్‌డేట్ ఇచ్చారు.  అక్టోబర్ 6న 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ట్రైలర్‌లో వెంకటేష్ పాత్ర స్వభావం, కుటుంబ నేపథ్యం, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, కామెడీ, ఎమోషన్, యాక్షన్‌కు సంబంధించిన మరిన్ని అంశాలు ఉంటాయని తెలిపారు.

అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ అక్టోబర్ 7 నుంచే ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ఉండవని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. అంటే అక్టోబర్ 9న నేరుగా థియేటర్లలోనే ప్రేక్షకులు సినిమాను చూడనున్నారు.  ముందస్తుగా ఎలాంటి ప్రీమియర్స్ షో లు ఉండవని స్పష్టం చేశారు.

కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ సినిమాలో నవ్వులు, భావోద్వేగాలు, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉంటాయని నాగవంశీ చెప్పారు. సెలవులను కుటుంబంతో కలిసి థియేటర్‌లో ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందన్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఒక ఎత్తయితే.. అక్టోబర్ 6న రాబోయే ట్రైలర్ మరో ఎత్తు కానుందనే అంచనాలు నెలకొన్నాయి. వెంకీ కామెడీ టైమింగ్‌కు త్రివిక్రమ్ మాటల మేజిక్ తోడైతే.. 'ఆదర్శ కుటుంబం' థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి..