Indian Army: హైదరాబాద్కు వరదలొస్తే.. హుస్సేన్ సాగర్లో భారత సైన్యం ఏం చేసిందంటే..

Indian Army: హైదరాబాద్కు వరదలొస్తే.. హుస్సేన్ సాగర్లో భారత సైన్యం ఏం చేసిందంటే..

హైదరాబాద్: వరదలు ముంచెత్తినప్పుడు సహాయక బృందాలు పడే కష్టం, బాధితులకు చేసే సాయం వెలకట్టలేనిది. మరీ ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు రాత్రింబవళ్లు తేడా లేకుండా సహాయక చర్యల్లో తలమునకలై బాధితులకు ఆపన్న హస్తం అందించడాన్ని ఎన్నో సందర్భాల్లో చూశాం. వయనాడ్ బాధితులకు భారత సైన్యం ఎంత అండగా నిలుస్తుందో చూస్తూనే ఉన్నాం. విపత్తుల సందర్భంలో బయటపడేయటంలో ముందుండే ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ హుస్సేన్ సాగర్లో ఆగస్ట్ 2న శుక్రవారం ఫ్లడ్ రిలీఫ్ ఎక్సర్సైస్ నిర్వహించాయి. ఈ మాక్ డ్రిల్కు ‘‘ఎక్సర్సైస్ రాహత్’’ అని పేరు పెట్టారు. వరద సహాయక చర్యల్లో ఎవరి పాత్ర ఏంటో, బాధ్యతలు ఏంటో వివరిస్తూ ఈ మాక్ డ్రిల్ సాగింది. తెలంగాణ రాష్ట్రంలో వరదలు సంభవిస్తే సహాయక బృందాలు ఎంత ముమ్మరంగా సహాయక చర్యల్లో భాగం అవడానికి సిద్ధంగా ఉన్నారో ‘‘రాహత్’’లో కళ్లకు కట్టినట్టు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయక బృందాలు కూడా ‘రాహత్’లో అదరగొట్టాయి. 

ALSO READ | హైదరాబాద్​లో ఆర్యసమాజ్​ప్రస్థానం

వరదల్లో చిక్కుకున్న బాధితులను ఎలా కాపాడతారో ప్రాక్టికల్గా చేసి చూపించారు. హుస్సేన్ సాగర్లో ‘‘ఎక్సర్సైస్ రాహత్’’ నిర్వహించినట్లు భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. సమాచారం ఇస్తే చాలు సహాయక చర్యల్లో భాగం కావడానికి, బాధితులకు అండగా నిలవడానికి ఆర్మీ బలగాలు హైదరాబాద్లో సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా సహాయక చర్యల్లో భాగం కావడానికి సిద్ధంగా ఉంది. భారత సైన్యం నిర్వహించిన ‘‘ఎక్సర్సైస్ రాహత్’’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి, మేజర్ జనరల్ రాకేశ్ మొనోచా, బైసన్ డివిజన్ జనరల్ ఆఫీసర్ పాల్గొన్నారు.