
తెలంగాణలో బిజెపి బలపడిందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్. శుక్రవారం ఆయన చిట్ చాట్ చేస్తేూ.. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ వైపు నాయకులంతా ఆకర్షితులవుతున్నారన్న ఆయన.. ఈసారి TRS పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా సరిగా దొరకరన్నారు. టిఆర్ఎస్ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లో ఉన్నారన్న తరుణ్ చుగ్.. TRS, కాంగ్రెస్ కు చెందిన ముఖ్యనేతలు.. 24 మంది మాకు టచ్ లో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రైతులకు సమాధానం చెప్పలేకనే కేసీఆర్ ఢిల్లీ పోయి డ్రామా చేస్తున్నడన్నారు. కేసీఆర్ ఢిల్లీ పోయి వచ్చి ఏం చేసిండు?. ఢిల్లీ వచ్చి ఏం సాధించాడు. కేసీఆర్ తెలంగాణ రైతులకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ 80 స్థానాలు గెలుచుకుంటుందని.. ఎన్నికలు వస్తే మా సత్తా తెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ది ముగిసిన అధ్యాయం అన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో రైతులు భాదపడ్డారని.. చట్టాలు అమలులోకి వస్తే చాలా బాగుండేదని తెలిపారు తరుణ్ చుగ్.