
ధాన్యం కొనుగోళ్ల విషయంలో TRS-BJP డ్రామాలు ఆడుతున్నాయన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. బతికున్నప్పుడు రైతుల్ని పట్టించుకోని ప్రభుత్వం... చనిపోయాక 5లక్ష భీమా ఇస్తామడం సిగ్గుచేటన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ రైతుల్ని వరి వేయాలని చెప్పారని.. చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉండాలన్నారు. రుణమాఫీ, సబ్సిడీలు ఇవ్వకుండా, దాన్యం కొనకుండా కేవలం రైతు బంధుతో సరిపెడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు.