మీర్పేట్ కార్పొరేషన్ ముందు టీఆర్​ఎస్​ కార్పొరేటర్ ధర్నా

మీర్పేట్ కార్పొరేషన్ ముందు టీఆర్​ఎస్​ కార్పొరేటర్ ధర్నా

తన డివిజన్ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలంటూ మీర్పేట్ కార్పొరేషన్ ఎదుట టీఆర్​ఎస్​ కు చెందిన మహిళా కార్పొరేటర్ సౌందర్య విజయ్ ధర్నాకు దిగారు. డివిజన్ లో కనీస వసతులు లేవని.. దోమల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని వ్యాఖ్యానించారు. దోమల నివారణకు ఫాగింగ్ కూడా చేయడం లేదని తెలిపారు. స్థానికంగా డ్రైనేజీ సిస్టం చాలా అధ్వానంగా ఉందన్నారు. మురుగు నీరు మొత్తం డివిజన్ లోని ప్రజల ఇండ్లలోకి చేరుతుందని వెల్లడించారు.

డివిజన్ లోని పలు సమస్యలపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న.. లెటర్ రాసిచ్చినా పట్టించుకోవడం లేదంటూ సౌందర్య విజయ్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే మీర్పేట్ కార్పొరేట్ ఆఫీస్ ముందు ఆమె ధర్నాకు దిగినట్లు తెలిపారు. తమ డివిజన్ లో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఇక్కడే బైఠాయిస్తామని కార్పొరేటర్ సౌందర్య విజయ్ స్పష్టంచేశారు.